హీరో నాని కి ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి సినిమాలు తిస్తాడు అనే గుర్తింపు ఉంది. ఆయన కెరీర్ అంత చూసుకుంటే ఎక్కడ వల్గారిటీ లేని క్లీన్ సినిమాలే ఎక్కువగా ఉంటాయి. పక్కింటి కుర్రోడులగా కనిపించే నాని పాత్రలకి మిడిల్ క్లాస్ మనుషుల అంత బాగా కనెక్ట్ అవుతారు. నాని మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టాడు.బాపు గారి దగ్గర రాధ గోపాలం సినిమాలో క్లాప్ బాయ్ గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోగా స్టార్ అయ్యాడు. అలా అని నాని కెరీర్ అంత సాఫీగా సాగలేదు.

ఒక్క హిట్ కోసం నాని ఎదురుచూసిన రోజులు చాలా ఉన్నాయి. ఆయన కెరీర్ లో అలా మొదలైంది , భలే భలే మొగాడివోయ్ , యమ్ సి ఏ సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే పైసా , కృష్ణార్జున యుద్ధం లాంటి డిజాస్టర్స్ కూడా నాని కెరీర్ లో ఉన్నాయి. అయితే ఎన్ని హిట్స్ వచ్చిన ప్లాప్స్ వచ్చిన కూడా ఆయన వ్యక్తుత్వం మాత్రం ఎప్పుడు మారలేదు. సినిమా చిన్నదైనా పెద్దదైన కానీ దాన్ని ప్రోత్సహించడం నాని ని నాచురల్ స్టార్ గా నిలబెట్టింది. ఇక నాని నిర్మాతగా కూడా ఆ!! సినిమాతో మారాడు.

కొత్త డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన విశ్వక్ సేన్ తో నిర్మించిన  హిట్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక నాని ప్రస్తుతం టాక్సీ వాలా డైరెక్టర్ రాహుల్ తో శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా బ్రోచేవారుఎవరురా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో అంటే సుందరనికి సినిమాలో కూడా నాని నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: