
చూసిన ప్రతి క్షణం ఒక మధురానుభూతిని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల పొందవచ్చు అని చెప్పవచ్చు. జాక్, రోజ్ ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించిన ఈ టైటానిక్ చిత్రానికి 24 సంవత్సరాలు. టైటానిక్ దుర్ఘటనలో ఏకంగా 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే ఈ టైటానిక్ సినిమాలో మొదటి నుంచి క్లైమాక్స్ వరకూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించి చివర్లో జాక్ ను చంపేసి విషాదకరంగా చేశారు. అయితే డైరెక్టర్ ను పొగిడిన వారు మాత్రమే కాదు తిట్టిపోసే వారు కూడా ఉన్నారు. ఇకపోతే నాటి నుంచి నేటి వరకు ఇలాంటి అద్భుతమైన ప్రేమ కథ తెరకెక్కలేదు.
చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను టైటానిక్ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అలనాటి జాక్, రోజ్ ప్రేమ కథలు మైమరిపించేలా రాధేశ్యామ్ లో విక్రమాదిత్య , ప్రేరణల లవ్ స్టోరీ ఉండబోతోందా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ చిత్రానికి మూలం రాధాకృష్ణుల అని చెప్పవచ్చు. ఏదిఏమైనా టైటానిక్ సినిమాను మరిపించెలా రాధే శ్యామ్ వుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని చిత్రం మేకర్స్ చెబుతున్నారు.