త్రివిక్రం శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ సినీ కెరియర్ గైడ్ లైన్స్ త్రివిక్రం కనుసన్నల్లో ఉంటాయని అందరు అనుకుంటున్న మాటే. అంతెందుకు పవన్ చేస్తున్న సినిమాలపై ఏది ఓకే ఏది నాట్ ఓకే అన్నది కూడా త్రివిక్రం చూస్తున్నారట. ఆ క్రమంలోనే భీమ్లా నాయక్ పవన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇదిలాఉంటే భీమ్లా నాయక్ తో పాటు క్రిష్ తో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఈ రెండు సినిమాల తర్వాత మరో రీమేక్ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు టాక్. తమిళంలో సముద్రఖని నటించిన వినోదయ సీతం సినీమను తెలుగులో పవన్ తో రీమేక్ చేస్తున్నారట. సముద్రఖని డైరెట్ చేసిన ఈ సినిమాను తెలుగులో కూడా ఆయన చేత డైరెక్ట్ చేయించాలని చూస్తున్నారట. ఈ సినిమాను త్రివిక్రం ప్రొడ్యూస్ చేస్తారని. త్రివిక్రం తో పాటుగా రామ్ తాళ్లూరి సినిమా నిర్మాణంలో భాగమవుతారని తెలుస్తుంది.

వినోదయ సీతం సినిమా జీ 5లో రిలీజైన ఇండిపెండెంట్ మూవీ. ఈ సినిమా చూసిన త్రివిక్రం బాగా నచ్చేయడంతో పవన్ తో ఈ సినిమా లైన్ లో పెడుతున్నట్ట్టు తెలుస్తుంది. సముద్రఖని ఎలాగు తన డైరక్షన్ చేశాడు కాబట్టి అతన్నే డైరక్టర్ గా ఫిక్స్ చేశారట. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేయడం ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సముద్రఖని చేసిన వినోదయ సీతం సినిమాను తెలుగు ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా మార్పులు చేర్పులు త్రివిక్రం చేస్తారని టాక్. తను డైరెక్ట్ చేసినా చేయకపోయినా పవన్ సినిమా అంటే త్రివిక్రం హ్యాండ్ ఉండాల్సిందే. ఇక ఇప్పుడు త్రివిక్రం స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అంతా తానే నడిపిస్తాడని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: