
వీటితో పాటు సమంత మరో ఇంట్రెస్టింగ్ కాంబో ఫిక్స్ చేసుకుంది. అది కూడా ఓ లేడీ డైరక్టర్ సినిమాలో అమ్మడు నటిస్తుంది. ఆల్రెడీ ఆ డైరక్టర్ తో సినిమా చేసి హిట్ అందుకున్న సమంత మరోసారి ఆమె డైరక్షన్ లో సినిమా చేస్తుంది. సమంత నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ కాంబో రిపీట్ అవడం ఫ్యాన్స్ ను ఎక్సయిట్ అయ్యేలా చేస్తుంది. ఈసారి ఓ సస్పెన్స్ థ్రిన్నర్ తో సినిమా చేస్తున్నట్టు టాక్. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరరలో రానుందట.
ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ తో అన్ని మంచి శకునములే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత సమంత సినిమా చేస్తుందని తెలుస్తుంది. సమంత కూడా నందిని రెడ్డి సినిమా అనగానే చాలా ఎక్సయిటెడ్ గా ఉందని తెలుస్తుంది. శాకుంతలం, యశోద సినిమాలతో సమంత మరోసారి తన సత్తా చాటుతుందని అంటున్నారు. ఈమధ్యనే సమంత పుష్ప లో ఊ అంటావా సాంగ్ తో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది.