ఆఫ్టర్ డైవర్స్ సమంత జోరు చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. సమంత వచ్చిన కొత్తలో ఎలాగైతే వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిందో ఇప్పుడు అలానే వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ షాక్ ఇస్తుంది. ఆల్రెడీ గుణశేఖర్ తో ప్రెస్టిజియస్ మైథలాజికల్ మూవీ శాకుంతలం పూర్తి చేసిన సాం ఈమధ్యనే యశోద అనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ సినిమా జనవరి ఎండింగ్ కల్లా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. ఇక ఓ పక్క అమేజాన్ ప్రైం తో బాలీవుడ్ వెబ్ సీరీస్ డీల్ కూడా సెట్ అయ్యింది.

వీటితో పాటు సమంత మరో ఇంట్రెస్టింగ్ కాంబో ఫిక్స్ చేసుకుంది. అది కూడా ఓ లేడీ డైరక్టర్ సినిమాలో అమ్మడు నటిస్తుంది. ఆల్రెడీ ఆ డైరక్టర్ తో సినిమా చేసి హిట్ అందుకున్న సమంత మరోసారి ఆమె డైరక్షన్ లో సినిమా చేస్తుంది. సమంత నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ కాంబో రిపీట్ అవడం ఫ్యాన్స్ ను ఎక్సయిట్ అయ్యేలా చేస్తుంది. ఈసారి ఓ సస్పెన్స్ థ్రిన్నర్ తో సినిమా చేస్తున్నట్టు టాక్. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరరలో రానుందట.

ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ తో అన్ని మంచి శకునములే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత సమంత సినిమా చేస్తుందని తెలుస్తుంది. సమంత కూడా నందిని రెడ్డి సినిమా అనగానే చాలా ఎక్సయిటెడ్ గా ఉందని తెలుస్తుంది. శాకుంతలం, యశోద సినిమాలతో సమంత మరోసారి తన సత్తా చాటుతుందని అంటున్నారు. ఈమధ్యనే సమంత పుష్ప లో ఊ అంటావా సాంగ్ తో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: