తెలుగు సినిమా రంగంలో అక్కినేని ఫ్యామిలీది ఆరు దశాబ్దాల ఘనమైన చరిత్ర. దివంగత లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వేసిన బలమైన పునాది అక్కినేని ఫ్యామిలీకి ఈ రోజుకు కూడా తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం ఏర్పాటు చేసింది. ఏఎన్ఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. నాగార్జున కూడా మూడున్నర దశాబ్దాల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా నాగార్జున త‌న‌యులు నాగచైతన్య - అఖిల్ ఇద్దరు కొనసాగుతున్నారు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె కుమారుడు అయిన యార్లగడ్డ సుమంత్ కూడా రెండున్నర దశాబ్దాల క్రిందట వచ్చిన ప్రేమకథ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సమంత్‌ అడపాదడపా సినిమాలు చేస్తున్నా కెరీర్లో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సుమంత్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిన కీర్తి రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2003లో ఈ దంపతులు పెళ్లి చేసుకున్నా ఆ మరుసటి యేడాదే వీరు విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

కీర్తిరెడ్డి నాగార్జున రావోయి చందమామ సినిమాలో కూడా నటించింది. ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారు ? అన్నది అప్పట్లో ఎవరికీ అంతుపట్టలేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కీర్తి రెడ్డి ముందుగా మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చింది. నిజామాబాద్ మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డికి కీర్తిరెడ్డి స్వయానా మనవరాలు అవుతుంది. కీర్తి రెడ్డి తండ్రి కూడా బీజేపీలో .. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో కొనసాగారు.

ఈ కుటుంబానికి వేలాది కోట్ల ఆస్తులతో పాటు అమెరికాలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. సుమంత్‌కు ఇక్కడ హీరోగా  సక్సెస్‌లు లేకపోవడంతో సినిమాలు వదిలేసి అమెరికా వెళ్లి ... అక్కడే తమ కుటుంబానికి చెందిన వ్యాపారాలు చూసుకోవాలని కీర్తిరెడ్డి కండిషన్ పెట్టిందట. అయితే సుమంత్ మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులకు అక్కినేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని... తాను సినిమారంగాన్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారట. అలా ఈ ఒక్క విషయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ చివరకు వారు విడిపోవడానికి కారణం అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: