తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో నటించడానికి అనేక మంది నటీనటులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకసారి బ్రేక్ వస్తే తెలుగు ఇండస్ట్రీలోని స్ట్రక్ అయిపోతారు. పైగా తెలుగు ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ కూడా బాగానే ఇస్తారు. ఏ భాష నటినటులు అయినా కూడా తెలుగు ఇండస్ట్రీ లోకి వస్తే వారిని నెత్తిన పెట్టుకుంటారు మన వాళ్ళు. అందుకే ఇతర భాషల్లోని నటీనటులు కూడా తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి విలన్లుగా మారిపోతుంటారు. ఇక తాజాగా బాలకృష్ణ నటించిన సినిమాలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ అవుతున్నాడు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో ఆయన నటించడానికి భారీ పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కన్నడలో మంచి నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే బన్నీ పుష్ప సినిమాలో విలన్గా స్టార్ ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో వేరే నటులని విలన్లుగా అనుకున్నారు అనుకున్నప్పటికీ ఫహాద్ ఫాజిల్ ఫైనల్ చేశారు. ఇక ఈయనకు మలయాళంలో మంచి గుర్తింపు ఉంది. మలయాళంలో మంచి హిట్ ను అందుకున్నాడు ఈయన. ఇలాంటి టాప్ హీరో ఇక్కడ విలన్ గా మారిపోయాడు. ఇక హీరో విజయ్ సేతుపతి మనందరికీ తెలుసు. ఇక మాస్టర్ సినిమాలో ఈయన ఆయన విలనిజం ఏంటో చూపించాడు. తాజాగా ఉప్పెన సినిమాలో కూడా విలన్ గా ఆయన నటించాడు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ తెలుగులో వచ్చిన ఈగ సినిమా తనదైన విలనిజం చూపించాడు.

 విజయ్ పులి.. సల్మాన్ దబంగ్ 3  అనే సినిమాలో కూడా సుదీప్ విలన్ గా కనిపించాడు. ఇక పోతే రవి కిషన్ భోజపురి లో స్టార్ ర్ తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి విలన్ గా మారాడు. బన్నీ హీరోగా చేసిన రేసుగుర్రం సినిమాలో విలన్గా తనదైన నటనతో  మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఆ ఒక్క సినిమాలోనే కాకుండా అనేక సినిమాలలో విలన్ గా చేసాడు ఈయన. ఇకపోతే వరుడు సినిమా లో విలన్గా తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్నాడు సునీల్ శెట్టి. ఓకే బాలీవుడ్ స్టార్ హీరో అయినా అనిల్ కపూర్ ఇప్పుడు సర్కారు వారి పాట ఈ సినిమాలో విలన్గా మనందరికీ కనిపించబోతున్నాడు. ఏమైనా తమ భాషలో ఒక స్టార్ హీరో లాగా ఉన్న వీరందరూ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా మారారు దీనికి కారణం అక్కడ హీరోగా వారు తీసుకుంటున్న పారితోషికం కంటే ఇక్కడ తీసుకుంటున్న పారితోషికం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: