ఇక ఓ పది చిన్న సినిమాల వరకు ఈ సంక్రాంతి పండగకి విడుదల కాబోతున్నాయి.వాటిలో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన 'అతిథిదేవోభవ' సినిమా ఒకటి.'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి అనుకున్న విడుదల డేట్ కి రాబోతున్నట్టు ప్రకటన చేయడం ఇంకా 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బ్రదర్స్ రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన సినిమా కావడం అలాగే శేఖర్ చంద్ర సంగీతంలో రూపొందిన పాటలు కూడా మంచి హిట్ అవ్వడంతో ఈ సినిమాపై జనాల ఫోకస్ పడింది.మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది.? మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్ కు ఈ సినిమా ఆ లోటుని తీర్చిందా? అనే విషయాలు చూస్తే..ఈ సినిమా దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త కథ ఏమీ కాదు. తెలుగు సినిమా ప్రేక్షకులకి మారుతీ అలవాటు చేసిన వింత జబ్బుల కథే ఇది. అయితే ఇలాంటి వింత జబ్బుల ఫార్ములాతో ఈ మధ్య మారుతీనే సక్సెస్ లు అందుకోలేకపోతున్నాడు. అలాంటిది ఈ కొత్త దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ ఎలా సక్సెస్ అందుకుంటాడు.

కనీసం అతను అనుకున్న పాయింట్ ను ఆసక్తిగా మలచడంలో కూడా అతను సక్సెస్ కాలేకపోయాడు.నిర్మాణ విలువలు పరవాలేదు.అమర్ నాద్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపిస్తుంది. అయితే నీరసంగా సాగుతున్న ఈ సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది కచ్చితంగా శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ అనే చెప్పాలి.'బాగుందే' 'నిన్ను చూడగానే' వంటి రెండు పాటలు చాలా బాగున్నాయి. అవి థియేటర్ నుండీ బయటకి వచ్చాక కూడా చెవిలో మారు మొగిపోతాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఇతను చాలా పర్వాలేదు అనిపించాడు.ఒక్క శేఖర్ చంద్ర మ్యూజిక్ తప్ప ఈ సినిమాకి మరో హైలెట్ అనేది లేదు.మ్యూజిక్ ప్రియులు ఈ సినిమా కోసం వెళ్లొచ్చు. ఇక ఎంతో సహనం ఉంటే తప్ప 2గంటల 13 నిమిషాల పాటు ఈ సినిమాని థియేటర్లో కూర్చోని చూడటం చాలా కష్టం. మొత్తానికి హిట్టు కోసం ఎదురు చూస్తున్న ఆదికి ఈ సినిమా నిరాశ పరిచిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: