వాస్తవానికి సినిమా అనేది రంగుల ప్రపంచం, ఇక్కడ మంచితో పాటు చెడు కూడా ఉంటుందని అందరూ అంటుంటారు, అసలు ఇక్కడేమిటి ఎక్కడైనా అదే పరిస్థితి కదా అని తరచూ అనేక మంది సినిమా ప్రముఖులు పలు ఇంటర్వూస్ లో వెల్లడించడం జరిగింది. ఇక్కడికి వచ్చి మంచి అవకాశాలు దొరికిన అనంతరం కొందరు వాటిని ఎంతో తెలివిగా అందిపుచ్చుకుని తమ జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకుంటారని, అయితే మరికొందరు మాత్రం ఇక్కడ మంచిచెడులు ఎరుగక ఇతరుల ప్రేమ, వ్యామోహంలో పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కూడా వారు చెప్పడం జరిగింది.

అందుకే మనం ఎవరితో పరిచయాలు పెంచుకోవాలన్నా కూడా ఒకటికి రెండుసార్లు అవతలి వారి గురించి తెలుసుకుని మసులుకోవాలని ఎందరు ఎన్ని మాటలు చెప్పినా కూడా కొందరు మాత్రం వాటిని లక్ష్య పెట్టరు. ఆ విధంగా ఒక దర్శకుడి ప్రేమ మాయలో పడి ఏకంగా తన జీవితాన్నే నష్టపోయే పరిస్థితికి వచ్చింది ఒక యువ నటి. కాగా అసలు విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన హర్షవర్ధన్ అనే నిర్మాత, ప్రస్తుతం సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తున్న యువ నటి ఒకరిని పెళ్లి చేసుకుంటానని మోసగించి ఆమెతో కొన్నాళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి చివరికి తనకు పట్టనట్లుగా తప్పించుకుని ముఖం చాటేశాడు.

ఇక ఇటీవల సదరు నటి తనను పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో కుదరదని తేల్చి చెప్పాడు. దానితో తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన సదరు హీరోయిన్ పోలీసులని ఆశ్రయించి హర్షవర్ధన్ పై కేసు నమోదు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు హర్షవర్ధన్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎక్కడైనా అమ్మాయిలు ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒకరితో పరిచయం పెంచుకునే ముందు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, లేకపోతే ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: