ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా బాలీవుడ్లో ఏకంగా 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అక్కడి స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా పుష్ప సినిమా కలెక్షన్లు సొంతం చేసుకోవడం విశేషం. ఇక పుష్ప సినిమా విడుదలై ఏడు వారాలు గడుస్తున్నా ఇంకా బాలీవుడ్ లో ఈ సినిమా వెయ్యి థియేటర్లకు పైగా ప్రదర్శితమవుతుంది అంటే అది మామూలు విషయం కాదు. మరోవైపు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక పుష్ప సినిమాని హిందీలో మనీష్ షా అనే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. 

పుష్ప సినిమా రైట్స్ ను తక్కువ మొత్తానికే తీసుకున్న మనీష్ షా కు ఈ సినిమా రెట్టింపు లాభాలను అందించింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పుష్ప సినిమా కలెక్షన్స్ ని చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇక పుష్ప పార్ట్ 1భారీ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడంతో..పుష్ప పార్ట్ 2 బాలీవుడ్ లో ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకునే అవకాశం ఉందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా డిస్ట్రిబ్యూటర్ మనీష్ షా ఓ సందర్భంలో మాట్లాడుతూ..' దక్షిణాది సినిమాలు హిందీలోకి డబ్ అయితే ఆ సినిమాలకు ఊహించని స్థాయిలో ఆదరణ దక్కుతుందని..

బన్నీ నటించిన సరైనోడు సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ టిఆర్పి రేటింగ్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసిందని.. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఆ రికార్డు బ్రేక్ అయింది అని చెప్పుకొచ్చారు. విడుదలకు ముందే పుష్ప మూవీ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తనకుందని మనీష్ షా అన్నారు. అంతేకాదు ఈ సినిమాను చూసి బాలీవుడ్ మేకర్స్ కొన్ని విషయాల్లో మారాలని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓటీటీ లో రిలీజ్ అయిన తర్వాత కూడా పుష్ప సినిమా థియేటర్స్ లో నడుస్తుందని తాను అసలు ఊహించలేదని చెప్పుకొచ్చారు. దీంతో మనీష్ షా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: