తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా కబడ్డీ కబడ్డీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి.. ఆ తర్వాత వసంతం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి పేరు పొందింది.. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయింది.. దీంతో తర్వాత కొన్ని సినిమాలలో వదినగా , అక్కగా పలు సినిమాలలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.. అయినా కూడా వాటిలో కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.


కొన్ని సినిమాలకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ.. అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు హీరోయిన్ నుంచి దర్శకురాలిగా మారుతోంది.. డైరెక్టర్ గా కూడా ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తోంది ఈమె. అందులో హీరోగా చేతన్ చీను నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి ఒక సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు హీరో. ఇక అలాంటి సమయంలో ని ఈ హీరోయిన్ డైరెక్షన్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.. ఒక విభిన్నమైన ప్రేమ కథ ను ఈ సినిమాలో చూడబోతున్నాము అంటూ డైరెక్టర్ కళ్యాణి తెలియజేస్తోంది. ప్రస్తుతం తన పోస్టర్ కూడా వైరల్ గా మారుతోంది.

ఇక ఈ పోస్టర్ లో చూసినట్లయితే.. హీరో చేతన్ బాత్రూం లో పూర్తి నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది.. అంతే కాకుండా అతని చేతిలో ఒక సిగరెట్ పట్టుకొని ఏదో బాధపడుతున్నట్లుగా కూడా కనిపిస్తున్నది. ఇక ఈ సినిమాతో కళ్యాణి దర్శకురాలిగా కొన్ని విభిన్నమైన అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అన్నట్లుగా కనిపిస్తోంది.. నటిగా పలు విభిన్నమైన సినిమాల్లో పాత్రలు వేసి ఆకట్టుకున్న కళ్యాణి ఇప్పుడు ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ వంటి భాషలలో కూడా విడుదల చేస్తోందట.. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదని సమాచారం. షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: