
ఈ ఫోటో చూసిన తర్వాత హీరోయిన్ ఏంటి గ్యాస్ సిలిండర్ స్కూటీకి కట్టుకొని వెళ్లడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. కానీ అసలు విషయం తెలిసి కన్ఫ్యూజన్ నుంచి బయట పడుతున్నారు ఇంతకీ అసలు విషయం ఏమిటంటే హీరోయిన్ స్కూటీ పై గ్యాస్ సిలిండర్ కట్టుకుని వస్తుంది నిజజీవితంలో కాదు ఒక సినిమా షూటింగ్లో భాగంగా. సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలు భారీగా తరలి వస్తుంటారు. షూటింగ్ జరుగుతున్న సన్నివేశాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించటం చేస్తూ ఉంటారు. కొంతమంది వీటిని సోషల్ మీడియా లో పెడుతూ ఉంటారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక నెటిజన్ ఫోటో తీసి సోషల్ మీడియా లో పెట్టడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది.
అసలు మేటర్ లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో సినిమా షూటింగ్ సందడి చోటు చేసుకుంది. హీరోయిన్ స్కూటీ పై గ్యాస్ సిలిండర్ తీకువెళ్తూ తర్వాత ఫోన్ రావడంతో టూవీలర్ ఆఫీ ఫోన్ మాట్లాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. కాగా ఈ సినిమా డైరెక్టర్ దాశరథి సారధ్యంలో తెరకెక్కుతు ఉండగా.. చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ నేపథ్యంలో అక్కడికి భారీగా జనం తరలివచ్చారు. రెండు మూడు రోజుల పాటు అక్కడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.