బుల్లితెరపై క్రేజీ జంటలలో రష్మీ మరియు సుడిగాలి సుధీర్ జంట ఒకటి. సుధీర్, రష్మీల లవ్ ట్రాక్‌కి పనిచెప్పాల్సిందే అన్నట్టుగా భారీగానే మసాలా దట్టిస్తుంటారు

దుమ్ము రేపే డాన్స్ పెర్ఫార్మన్స్ ల మధ్య రష్మీ, సుధీర్ రొమాన్స్ అయితే హైలెట్ గా నిలిచేది. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దానిని ఈ కార్యక్రమం కోసం తెలివిగా వాడుకున్నారట.. రష్మీతో సుధీర్ డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన ప్రయోగాలు అన్ని చేశారు. అన్నీ సక్సెస్ కూడా అయ్యాయి. ఢీ షోలను ఈ జంట తెగ సందడి చేసే వారు. అయితే తాజా సీజన్‌కి రష్మీ, సుధీర్ లేని కారణంగా ఓ సెక్షన్ ఆడియన్స్ షోకి దూరం అయ్యారని మాత్రంమనం చెప్పవచ్చు.

సుడిగాలి సుధీర్‌ మరియు రష్మీ గౌతమ్‌.. ఈ రెండు పేర్లు గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వీరిద్దరి జోడీ జబర్దస్త్ ప్రోగ్రామ్ సహా ఇతర కార్యక్రమాల్లో చేసే సందడి మామూలుగా ఉండదు. వీరి జంటకు ప్రత్యేకమైన క్రేజ్ కూడా ఉంది. అసలు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌.. తమ క్రేజ్‌ను బేస్ చేసుకుని తమ రెమ్యునరేషన్స్ పెంచాలని గట్టిగా కోరడంతో, జబర్దస్త్ నిర్వాహకులు వారిని పక్కన పెట్టారంటూ కూడా వార్తలు బాగానే వినిపించాయి. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. మళ్లీ సుధీర్‌, రష్మీ గౌతమ్ జంట జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సందడి చేయడానికి వచ్చేశారట.. ఎక్స్‌ట్రా జబర్ద్‌దస్త్‌లో వీరి హంగామాను చూపిస్తూ స్టేజ్‌పై తెగ సందడి సందడి చేస్తున్నారు.


తాజాగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్ స్కిట్‌లో ఈ జంట చేసిన రచ్చ అయితే మాములుగా లేదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ జోకర్ మాదిరిగా మారి తెగ సందడి చేశాడట.. సుధీర్ ని బొమ్మ అని పరిచయం చేస్తూ గిఫ్ట్ గా ఇస్తాడట రాం ప్రసాద్. చిన్న పిల్లాడిలా మారి శ్రీను అయితే తెగ సందడి చేస్తాడు. అయితే బొమ్మతో డ్యాన్స్ చేయాలని రోహిణి ఆశ పడగా, ఎక్కడ నొక్కాలని అడగగా ఎక్కడ నొక్కిన చేస్తాడని రష్మిక అనడంతో నవ్వులతో స్టేజి నిండిపోయింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అయితే తెగ హల్ చల్ చేస్తుంది. వీరి పర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు తెగ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: