సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు కొన్ని వర్గాలను మాత్రమే టార్గెట్ చేస్తూ సినిమాలను చేస్తూ ఉంటారు. వారు ఆయా వర్గాలను ఎంతగా అలరిస్తారు అంటే ప్రతి సినిమా కూడా ఆ వర్గాన్ని భారీ స్థాయిలో ఆకట్టుకుంటూ ఉంటుంది. మంచి వసూళ్లను కూడా తెచ్చి పెడుతూ ఉంటుంది. అలా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే టాలీవుడ్ హీరోలు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆడియన్స్ ను ఆనందింపజేసే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ కి అలాంటి హీరోలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మరొక వాదన కూడా వినిపిస్తోంది.

పేరుకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అని చెబుతున్న కూడా అందులో భారీ యాక్షన్ సన్నివేశాలను, రొమాంటిక్ సన్నివేశాలను జోడిస్తున్నారు. మన మేకర్స్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ రొమాంటిక్ సన్నివేశాలు పెట్టి దానిని ఇంటిల్లిపాది కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా అని చెప్పి థియేటర్లకు రప్పించే చూపిస్తున్నారు. అయితే ఫ్యామిలీతో కలిసి అలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాలు చూడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బాలకృష్ణ నాగచైతన్య ఇద్దరు కూడా ఫ్యామిలీ సినిమాలు కూడా వారికి ఈ సినిమాలో ఏమాత్రం రీచ్ కావడం లేదు.

ఒకప్పుడు శోభన్ బాబు ఫ్యామిలీకి బాగా దగ్గర అయ్యే సినిమాలు చేసేవారు. ఆ తర్వాత వెంకటేష్ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. శర్వానంద్ నాని ఇలాంటి హీరోలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలను చేస్తున్నారు. పక్కింటి అబ్బాయి లవ్ ఫీల్ అయ్యే నాని సినిమాలు చేయడంలో మొదటి నుంచి ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అయితే వీరికి సక్సెస్ అనేది మాత్రం రావడం లేదని చెప్పాలి. ప్రేక్షకుల అభిరుచి మారడంతో బోల్డ్ సన్నివేశాలు పెట్టకపోవడంతో సక్సెస్ రావడం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మరి  ఈ హీరోలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంటర్ టైనర్ చేయడంలో మంచి వైపు చూపిస్తే కానీ ఆ సినిమాలు హిట్ కావడం లేదు అది ఏ విధంగా ఉంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: