ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అయ్యే రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ కు ఉన్నంత క్రేజ్ మరే షోకి లేదు. అందువల్లనే అమెరికాలో ప్రారంభం అయిన ఈషో 140 దేశాల ప్రజలకు నచ్చి వారివారి భాషలలో ప్రసారం అయ్యే స్థాయికి చేరిపోయింది. సాధారణంగా సినిమా ఇంటర్వ్యూలు చాల ఫార్మల్ గా ఉంటాయి.


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ ఇంటర్వ్యూలు దీనికి భిన్నంగా నడుస్తున్నాయి. ఒక పెద్ద రూమ్ లో అనేకచోట్ల కెమెరాలు పెట్టి రాజమౌళి జూనియర్ చరణ్ లు ఒక కాలేజీ హాస్టల్ మేట్స్ లా ఒకరిపై ఒకరు ఒక గదిలో కూర్చుని విపరీతంగా జోక్ లు వేసుకుంటూ కొనసాగిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  


రాజమౌళి కుర్చీలో కూర్చుని ఉంటే కాళ్ళు ఎత్తిపెట్టుకుని కూర్చుని జూనియర్ చక్కగా నేలమీద కూర్చుని తన సహజమైన జోక్స్ తో చరణ్ రాజమౌళిని ఒక ఆట ఆడుకున్న దృశ్యాలు విపరీతంగా వైరల్ గా మారడంతో సినిమా పబ్లిసిటీ ఇలా కూడ చేయవచ్చు అనే కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా 'బిగ్ బాస్’ షోలో కనిపిస్తూ ఉంటాయి.


దుబాయ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ఫైనల్ ప్రమోషన్ ను మొదలుపెట్టి అక్కడ నుంచి బెంగుళూరు ఢిల్లీ అమృతసర్ కలకత్తాలో ఈమూవీ ప్రమోషన్ ముగిసిన తరువాత ఆఖరికి కాశీ చేరుకొని కాశీవిశ్వనాథ్ ని ఆశీస్సులు తీసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాత ఈమూవీ విడుదల రోజున మొదటిరోజు మొదటి షో మారు వేషాలు వేసుకుని జనం మధ్య కూర్చుని ఈమూవీని చరణ్ జూనియర్ లు చూస్తారట. ఇలా రకరకాల సరికొత్త ప్రమోషన్ ఆలోచనలతో రాజమౌళి చేస్తున్న ఫీట్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. భారీ భారీ సినిమాలు తీయడమే కాదు ఎలా సరికొత్తగా ప్రమోట్ చేయాలో రాజమౌళికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అంటూ కామెంట్ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: