రాకింగ్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన పాన్ ఇండియా సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 2 నిజానికి ఎప్పుడో రిలీజ్ కావలసింది, అయితే మధ్యలో కరోనా పరిస్థితుల కారణంగా పలుమార్లు వాయిదా పడి ఫైనల్ గా నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ భారీ పాన్ ఇండియా సినిమాపై కేవలం కన్నడ ఆడియన్స్ లో మాత్రమే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక నేడు విడుదలైన ఈ సినిమాపై చాలా వరకు మంచి ప్రసంశలు కురుస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందని, అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంత నెమ్మదించిందని, అయితే సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్, హీరో ఎలివేషన్ సన్నివేశాల అయితే అదిరిపోయాయని, ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ అయితే హృదయాన్ని తాకుతుందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక హీరో యాష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, విలన్ సంజయ్ దత్, ముఖ్య పాత్రదారి అయిన రవీనా టాండన్ ఇలా అందరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని, సినిమాలో భారీ స్థాయిలో ఉండే విజువల్స్, ఫైట్స్ తో పాటు పాటలు, అలానే బ్యాక్ స్కోర్ కూడా ఎంతో బాగుందని మరికొందరు ప్రేక్షకులు అంటున్నారు. సినిమా ఆద్యంతం సగటు ప్రేక్షకుడు ఆశించిన విధంగానే ఉందని, అయితే ఫ్యామిలీ ఆడియన్స్ రాబోయే రోజుల్లో ఈ మూవీని ఎంత వరకు ఆదరిస్తారు అనేది చూడాలని, కానీ మాస్, యువత, వంటి వారికి ఈ మూవీ ఎంతో బాగా నచ్చుతుందని, ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుందని, రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఆ విధంగా అబ్బా అనే విధంగా కెజిఎఫ్ చాఫ్టర్ 2 మూవీ మరొక భారీ సక్సెస్ అందుకోనుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: