కేజీఎఫ్ చాప్టర్ 2 కి తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఇంకా సినీ విమర్శకుల రివ్యూలు కూడా అలానే ఉన్నాయి. ఎలివేషన్స్ తప్ప ఎమోషనలేదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అయితే ఇవేవీ కలెక్షన్ల మీద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.'కేజీయఫ్ 2' సినిమా తొలి వారాంతంలో అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్ళు నమోదు చేసింది. అటు నార్త్ లో ఇటు సౌత్ లో సరైన పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 546 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.మొదటి సోమవారం (5వ రోజు) 'కేజీయఫ్ 2' సినిమా వసూళ్లలో కొంచెం డ్రాప్ కనిపించింది. సోమవారం నాడు కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సహజమే. కాకపోతే ఐదవ రోజు అవ్వడం వల్ల 50 శాతానికి పైగా పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.57.90 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని వసూలు చేసింది.



తెలుగులో ఓ డబ్బింగ్ సినిమా ఐదు రోజుల్లోనే రూ.57.90 కోట్ల షేర్ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు 'రోబో' సినిమా పేరిట ఉండేది. ఇక ఒక్క నైజాంలోనే 'కేజీయఫ్ 2' సినిమా 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. డబ్బింగ్ సినిమా ఈ ఏరియాలో ఇంత వసూలు చేయడం ఇదే ఫస్ట్ టైమ్.డబ్బింగ్ సినిమానే అయినా 'కేజీయఫ్ 2' సినిమా బాలీవుడ్ లో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది. హిందీలో అత్యంత వేగంగా 100 కోట్లు ఇంకా వేగంగా ఐదు రోజుల్లోనే రూ. 219.56 కోట్లను రాబట్టి సౌత్ సినిమాగా సూపర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 'దంగల్' సినిమా లైఫ్ టైం రన్ రూ. 270 కోట్లను బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో అనేది చూడాలి.'కేజీయఫ్' మూవీకి కొనసాగింపుగా.. కన్నడ హీరో యష్ ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ''కేజీయఫ్ 2''. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ఇంకా బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ ఇంకా అలాగే రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్,రావు రమేష్ ఇంకా అలాగే ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: