
ఓటమి ఎరుగని దర్శకుడు.. తన సినిమాలో ఏదో ఒక సామాజిక అంశంతో కమర్షియల్ హిట్ కొట్టే కొరటాల శివ మెగాస్టార్, మెగా పవర్ స్టార్ చరణ్ ఇద్దరితో కలిసి చేసిన ఆచార్యకి ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నా.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నా సరే సినిమా టికెట్స్ ఆశించిన స్థాయిలో బుకింగ్ జరగడం లేదు. అసలైతే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సి ఉంటుంది.
అలాంటిది అసలు ఆచార్య సినిమా టికెట్లు పెద్దగా బుక్ అవడం లేదు. చిరంజీవి, చరణ్ కాంబో సినిమాకు ఈ పరిణామం అసలు ఊహించలేదు. అయితే వెంట వెంట స్టార్ సినిమాలు రిలీజ్ అవడం టికెట్ల రేట్లు పెరగడం లాంటివి ఆడియెన్స్ ని సినిమా అంటే భారం అయ్యేలా చేశాయన్న మాట వినిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ మెగా ఆచార్య సినిమా మీద పడేటట్టు కనిపిస్తుంది. మొన్న రిలీజైన కె.జి.ఎఫ్ 2 సినిమా టికెట్ల కు ఉన్న బజ్ కూడా ఆచార్య సినిమా కు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇలానే చూస్తే ఆచార్య ఓపెనింగ్ డే పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవడం కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం మెగాస్టార్ ఆచార్యని ఆపే వారు ఉండరని చెప్పొచ్చు.