అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సినిమా ఇండస్ట్రీలో ఏర్పడుతుంది. అలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత ఎన్నో కమర్షియల్ సినిమాలలో అందాలను ఆరబోసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తుంది.

అందులో భాగంగా సమంత ఇప్పటికే యూ టర్న్ ,  ఓ బేబీ వంటి పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత యశోద అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో  నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో హరి శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా యశోద సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. యశోద మూవీ నుంచి మే 5 వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ లో ఉన్ని ముకుందన్ , వరలక్ష్మీ శరత్ కుమార్ , రావు రమేశ్ , మురళీ శర్మ ,  సంపత్ రాజ్  ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 12 వ తేదీన యశోద మూవీ ని విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: