
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది అతి పెద్ద డిజాస్టర్ దిశగా వెళుతోందని మాటలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి మీద ఉన్న అభిమానంతో కాస్తూ కూస్తో కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో చూసుకుంటే చాలా మైనస్ లు ఉన్నాయి. బలమైన కథ, అందుకు తగిన కథనం రెండూ లేకుండా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాడు. ఇక మ్యూజిక్, కామెడీ కూడా లేకపోవడం ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి. ఇక సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ కాస్త సినిమాను పైకి లేపాడు. లేదంటే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి.
ఇక సినిమా అనౌన్స్ మెంట్ నుండి ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను అనుకున్నారు. పోస్టర్స్, టీజర్ లో కూడా ఈమె కనిపించింది. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ... ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున దర్శకుడు కొరటాల శివ కాజల్ ఇందులో లేదని చెప్పి అభిమానులను బాగా నిరాశపరిచాడు. ఒకవేళ ముందు నుండి అనుకున్నట్లుగా కాజల్ ఈ సినిమాలో ఉండి ఉంటే... బాగుండేది అనిపించింది. పూజ హెగ్డే ఉన్నా ఆమె చేసింది ఏమీ లేదు. కానీ కాజల్ నటన ఎమోషనల్ హావభావాలు అన్నీ ప్రేక్షకులను కట్టిపడేసి ఉంటాయి. ఇక చిరంజీవితో కొన్ని కామెడీ సీన్స్ చేయించి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. సో సినిమాలో కాజల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.