ముంబై 26/11 ఎటాక్ నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన సినిమా మేజర్. గూఢచారి ఫేం శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అడివి శేష్ నటించగా సయి మంజ్రేకర్, శోభిత నటించారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ తన జి.ఎం.బి బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇస్రో అధికారి అయిన ఉన్నికృష్ణన్ కొడుకు సందీప్ ని డాక్టర్, ఇంజినీర్ అవ్వాలని కోరుకుంటాడు. అయితే సందీప్ మాత్రం ఎరిర్ ఫోర్స్ లో చేరాలని అనుకుంటాడు. అక్కడ అవకాశం రాకపోయేసరికి ఆర్మీ లో జాయిన్ అవుతాడు. తండ్రి ఉన్నికృష్ణన్ కి ఇష్టం లేకపోయినా స్రే సైన్యం లో చేరుతాడు సందీప్. తను ప్రేమించిన అమాయి ఇషా (సయి మంజ్రేకర్)ని పెళ్లి చేసుకుంటాడు. కుటుంబం కంటే సైనికుడిగా దేశాన్ని రక్షించడమే ముఖ్యం అనుకుంటాడు సందీప్. ఈ క్రమంలో అతనికి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ఇదే టైం లో ముంబైలో తాజ్ హోటల్ లో ఉగ్ర దాడి జరుగుతుంది. హోటల్ లో వందల మంది ప్రజలు ఉన్నారని తెలుసుకున్న సందీప్ తన టీం తో కలిసి అక్కడకు వస్తాడు. ఆ టైం లో సందీప్ బందీలుగా ఉన్న ప్రజలను ఎలా రక్షించాడు. ఈ పోరాటంలో అతను ఎలా మృతి చెందాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో మేజర్ సినిమాని చాలా సిన్సియర్ గా తెరకెక్కించారు. అడివి శేష్ అతని టీం చాలా నిజాయితీగా ఈ సినిమా చేశారు. బయోపిక్ సినిమాలను ఒక్కొక్కరు ఒక్కోలా తీస్తారు. అయితే ప్రేక్షకులను అలరించిన బయోపిక్ సినిమాల టాప్ లిస్ట్ లో తప్పకుండా మేజర్ కూడా ఉంటుంది.

26/11 ముంబై దాడుల మీద ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ మేజర్ మాత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురయ్యేలా చేయడంలో మేజర్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా సరే అవన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు.

మేజర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మేజర్ పర్సనల్ లైఫ్ గురించి చూపించగా ఇంటర్వల్ ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ముంబై దాడులు ఆ టైం లో సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా బందీలను కాపాడాడు అన్నది చూపించారు. సినిమా క్లైమాక్స్ 29 నిమిషాలు మాత్రం ప్రేక్షకులను ఉత్కంఠత కలిగేలా చేస్తుంది. కేవలం ముంబై దాడుల మీద సినిమాగా కాకుండా సందీప్ ఉన్నికృష్ణన్ పర్ఫెక్ట్ బయోపిక్ గా తెరకెక్కింది మేజర్. రెగ్యులర్ సినిమా లవర్స్ మాత్రమే కాదు.. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా బాగా నచ్చేస్తుంది.

నటీనటుల ప్రతిభ :

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ అదరగొట్టాడు. చేస్తున్న పాత్రని ఎలా పర్ఫెక్ట్ గా చేయాలో బాగా వర్క్ అవుట్ చేసినట్టు ఉన్నాడు. అందుకే సినిమాలో అడివి శేష్ కనిపించలేదు మేజర్ సందీప్ మాత్రమే కనిపించేలా నటించాడు. సయి మంజ్రేకర్ బాగానే చేసింది. శోభిత చిన్న పాత్రే చేసినా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, రేవతి తమ అభినయంతో మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ స్పీచ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తెసుకెళ్లింది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక  సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు అడివి శేష్. ఆ విధంగా కూడా అడివి శేష్ తన సత్తా చాటాడు. గూఢచారి సినిమాతో డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శశి కిరణ్ తిక్క మేజర్ తో మరోసారి తన డైరక్షన్ టాలెంట్ చూపించాడు. మహేష్ నిర్మాతగా తన టేస్ట్ ఏంటన్నది చూపించారు. సినిమాకు ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్ :

అడివి శేష్

స్క్రీన్ ప్లే

బిజిఎం

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

చెప్పుకునేందుకు ఏమి లేవు

బాటం లైన్ :

మేజర్.. సందీప్ ఉన్నికృష్ణన్ కి గొప్ప నివాళి..!

రేటింగ్ : 3.25/5


మరింత సమాచారం తెలుసుకోండి: