
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ నాని వ్యక్తిత్వం గురించి కూడా చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. పవన్ కళ్యాణ్ స్టేజ్ పైకి రాగానే ఈలలతో వేదిక ప్రాంగణమంతా మారుమోగిపోయింది.. ఇక పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు విశిష్ట అతిథులు మీరే.. ఈ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ తన స్పీచ్ ప్రారంభించారు . ఇక నాని పై పవన్ కళ్యాణ్ పాజిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. నాని గురించి మాట్లాడుతూ నాని వ్యక్తిత్వం తనకు చాలా ఇష్టమని చెప్పిన పవన్ కళ్యాణ్.. అతడు బలంగా నిలబడే వ్యక్తి అని భగవంతుడు అన్నీ విజయాలు నాని కి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇక హీరోయిన్గా నటించిన నజ్రియా నజీమ్ కి , నరేష్ వీకే నదియ, రోహిణి ఇలా తదితర నటీనటులు అందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నాని గురించి ఇలా గొప్పగా చెప్పడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.