ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తదుపరి సినిమాను విజయవంతం చేసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకే గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఏమాత్రం అలసత్వం చూపించడం లేదు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క టీజర్ ఇటీవల విడుదల కాగా అది ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోన్నట్లు టీజర్ లో ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడానికి చాలామంది చాలా కారణాలు చెప్పారు

ఏదేమైనా ఆ సినిమా నుంచి కోలుకొని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతోష పరుస్తుంది. కాకపోతే ఆచార్య సినిమాకు రాంచరణ్ ఇమేజ్ కూడా తోడకపోవడం కొంతమంది మెగా అభిమానులను ఇంకా నిరాశ పరుస్తుంది. దాదాపు 70 కోట్ల వరకు ఆ సినిమా కోసం నిర్మాతలు నష్టపోయినట్లుగా తెలుస్తోండగా టాప్ స్థాయి హీరోలు ఇద్దరు ఉన్నా కూడా అంతటి నష్టాన్ని రావడం మెగా అభిమానులు అవమానంగా ఫీల్ అవుతున్నారు

ఈ తరుణంలో ఆచార్య సినిమా దెబ్బకు చిరు తన పేరును మార్చుకోవడం పై ఇప్పుడు అనేక రకాల కథనాలు వెధవడుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు చిరంజీవి ఇంగ్లీష్ పేరులో ఒక ఇంగ్లీష్ అక్షరం జత పరచడం జరిగింది. ఆ విధంగా రెండు E లకు బదులు మూడు E వాడి ఆయన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్నారు.  సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ అనేది ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. న్యూమరాలజీ ప్రకారం అందరూ పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అలా మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో పేరు మార్చుకోవడం నిజంగా హారట్ టాపిక్ గా మారింది ఇప్పుడు సినిమా పరిశ్రమలో

మరింత సమాచారం తెలుసుకోండి: