ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తదుపరి సినిమాను విజయవంతం చేసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకే
గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఏమాత్రం అలసత్వం చూపించడం లేదు.
మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ
సినిమా యొక్క టీజర్ ఇటీవల విడుదల కాగా అది ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది.
దసరా కానుకగా ఈ
సినిమా విడుదల కాబోతోన్నట్లు టీజర్ లో ప్రకటించింది.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య
సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడానికి చాలామంది చాలా కారణాలు చెప్పారు
ఏదేమైనా ఆ
సినిమా నుంచి కోలుకొని ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతోష పరుస్తుంది. కాకపోతే ఆచార్య సినిమాకు రాంచరణ్ ఇమేజ్ కూడా తోడకపోవడం కొంతమంది మెగా అభిమానులను ఇంకా నిరాశ పరుస్తుంది. దాదాపు 70 కోట్ల వరకు ఆ
సినిమా కోసం నిర్మాతలు నష్టపోయినట్లుగా తెలుస్తోండగా టాప్ స్థాయి హీరోలు ఇద్దరు ఉన్నా కూడా అంతటి నష్టాన్ని రావడం మెగా అభిమానులు అవమానంగా ఫీల్ అవుతున్నారు
ఈ తరుణంలో ఆచార్య
సినిమా దెబ్బకు చిరు తన పేరును మార్చుకోవడం పై ఇప్పుడు అనేక రకాల కథనాలు వెధవడుతున్నాయి.
గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు
చిరంజీవి ఇంగ్లీష్ పేరులో ఒక ఇంగ్లీష్ అక్షరం జత పరచడం జరిగింది. ఆ విధంగా రెండు E లకు బదులు మూడు E వాడి ఆయన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్నారు. సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ అనేది ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. న్యూమరాలజీ ప్రకారం అందరూ పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అలా
మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్
హీరో పేరు మార్చుకోవడం నిజంగా హారట్ టాపిక్ గా మారింది ఇప్పుడు
సినిమా పరిశ్రమలో