అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రెజీనా కాసండ్ర తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. 

అలాగే కొన్ని రోజుల క్రితం నుండే ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్యాస్ ట్యుటోరియల్‌ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మతో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కూడా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది.  అనుపమ పరమేశ్వరన్ తాజాగా నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ లో నటించింది. ఇలా వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా 'మారిచిక' అనే క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఏకమయ్యారు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి పెద్దగా అందజేయలేదు. జాతీయ అవార్డు గ్రహీత సతీష్ కాసెట్టి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తుండగా , ఇళయరాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. వన్ మోర్ హీరో మీడియా మరియు లక్ష్మీ భూపాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: