స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడి గా తన కెరియర్ ను ప్రారంభించాడు . మొదటి సినిమా తోనే బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందు కోవడం మాత్రమే కాకుండా ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి సందీప్ రెడ్డి వంగా అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు .

ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథ ను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో హిందీ లో రీమేక్ చేసాడు . కబీర్ సింగ్ మూవీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న యానిమల్  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది .

ఇది ఇలా ఉంటే తాజాగా యానిమల్ మూవీ గురించి మరియు యానిమల్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన అనిల్ కపూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు . యనిమాల్ మూవీ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని , ఈ మూవీ లో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు అనిల్ కపూర్ తెలిపారు. దర్శకుడు ఒక సూపర్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు అని,  అంతేకాక బాలీవుడ్ లో మంచి ప్లేస్ కి వెళ్తాడు అంటూ అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: