బాలీవుడ్ నటి అలియా భట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇకపోతే ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న అలియా భట్ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంజయ్ లీల బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గంగుబాయి కతీయవాడి సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో అలియా భట్ వేశ్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారని చెప్పాలి.ఇక ఈ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్న అలియా భట్..

 ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే  ఈమె నటించిన సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈమె పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. సమాచారం ప్రకారం అలియా భట్ నటించిన గంగుబాయి కతియవాడి సినిమా ఆస్కార్ రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవెల్ లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా అత్యధిక వసూళ్లను కూడా రాబట్టింది.ఇక ఈ క్రమంలోనే భారతీయ చలన చిత్రాల నుంచి ఆస్కార్ బరిలో ఉన్న సినిమాలలో గంగుబాయి కతియవాడి సినిమా కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మరో రెండు నెలలలో ఆస్కార్ రేసులో ఉన్నటువంటి సినిమాల ప్రకటన వెలవడనుంది.ఇక  ఈ క్రమంలోనే ఆస్కార్ రేసులో అలియా భట్ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా కాకుండా ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన rrr,డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఇది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ఆస్కార్ రేసులో ఉన్నాయి. ఇక తాజాగా అలియా భట్ గంగు బాయ్ కతియవాడి పేరు కూడా వినిపిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆస్కార్ రేసులో ఉండడం ఇది మొదటిసారి కాదు ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: