మాస్ మహారాజ రవి తేజ పోయిన సంవత్సరం శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసు కున్నాడు . క్రాక్ మూవీ తో అద్భుతమైన మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రవి తేజ ఈ సంవత్సరం ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ మూవీ లలో హీరో గా నటించాడు . ఈ రెండు మూవీ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి . ఇది ఉంటే తాజాగా రవితేజ 'ధమాకా' అనే రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ మూవీలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే .

మూవీ కి సినిమా చూపిస్త మామ ,  నేను లోకల్ ,  హలో గురు ప్రేమకోసమే మూవీ లతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించ గా ,  శ్రీ లీల ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది . ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను మరియు ఒక పాటను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ ఈ రోజుతో పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియో ద్వారా తెలియజేయండి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: