ఆస్కార్ కు దేశం నుంచి అందరి ఆదరణ చూర గొన్న అద్భుత చిత్రం 'ఆర్ఆర్ఆర్'ను పక్కన పెట్టి మోడీ, షా ల సొంత రాష్ట్రం గుజరాత్ కు చెంది న సినిమా ను నామినేట్ చేయడం పై దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు గళ మెత్తుతున్నారు.
తాజాగా టాలీవుడ్ ప్రముఖు లు కూడా స్పంది స్తుండడం సంచలన మైంది.

'ఆర్ఆర్ఆర్' సినిమా ని ఆస్కార్ కి.. నామినేట్ చేయక పోవడం అన్యాయమ ని సినీ దర్శకుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు, సినీ నటుడు.. వై. కాశీ విశ్వ నాథ్ అన్నారు. ఒక దేశ  భక్తి ని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగి ల్ లో.. కల్పిత కధ తో ఎంతో కష్టపడి.. ఎన్నో సంవత్సvరాలు వెచ్చించి.. అద్భుతం గా తెర  కెక్కించిన సినిమా.. 'ఆర్ఆర్ఆర్'. 'కంటెంట్' పరం గా గాని.. 'సందేశం' పరం గా గాని.. దేశ ఖ్యాతి ని ఇను మడింప జేసే సినిమా అని అన్నారు.

'ఆర్ఆర్ఆర్ ' చిత్రీకరణ  లో 'సీన్స్' రక్తి కట్టించడం లో గాని.. నటీ నటుల నుంచి పెర ఫార్మెన్స్ రాబట్టు కోవడం  లో గాని.. దర్శకులు రాజమౌళి గారు ప్రాణం పెట్టి పని చేశారు. హీరోలు జూ. ఎన్టీఆర్ గారు గానీ.. రామ్ చరణ్ గాని.. పాత్రల లో జీవించారు. టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘం. అలాంటి సినిమా ని ఆస్కార్ కి నామి నేట్ చేయకుండా.. ' చెల్లో షో' అనే గుజరాతీ సినిమా ను నామినేట్ చేయడం.. తెలుగు చిత్రాన్ని పట్టించు కోక పోవడం.. శోచ నీయమ ని ఆయన అన్నారు.. దీన్ని ఖండిస్తూ.. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడి గా.. నా అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నా నని..
కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: