మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మలయాళ సూపర్ హిట్ మూవీ అయినటు వంటి లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తార కీలక పాత్రలలో నటించగా ,  మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 'తార్ మార్ టక్కర్ మార్' అనే సాంగ్ ని ఇప్పటికే విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. 

ఈ సాంగ్ లో చిరంజీవి ,  సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్ లు వేశారు. ఈ సాంగ్ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పటికే ఈ సాంగ్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ మూవీ లో ఎండ్ రోలింగ్ టైటిల్ సమయంలో రానున్నట్లు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ధృవీకరించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి , సల్మాన్ ఖాన్ వేసిన స్టెప్ లు హైలైట్ గా మారాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: