టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రింధా విహారి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ శౌర్య సరసన షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించగా ,  అనీష్ ఆర్ కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందించాడు. మహతి స్వర సాగర్మూవీ కి అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.  

మూవీ మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 23 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కృష్ణ వ్రిందా విహారి మూవీ ప్రముఖ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లలో  ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 23 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: