టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన సాయి దరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి దరమ్ తేజ్ ఇప్పటికే పలు మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు మూవీ యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. 

దానితో ఈ మూవీ సాయి దరమ్ తేజ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ,   ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ "ఎస్ డి టి 15" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణను చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇవాళ సాయి దరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది. మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో సాయి దరమ్ తేజ్ తన చేతిలో ఒక కాగడా పట్టుకొని నిలుచని ఉన్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సాయి దరమ్ తేజ్ మరి కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తో సాయి దరమ్ తేజ్ కలిసిన నటించ బోయే సినిమా తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేక్ గా తేరకెక్కబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: