బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ ఇప్పటికే తాను నటించిన మూవీ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ ,  మెగాస్టార్ చిరంజీవి హీరో గా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే తెలుగు మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది. గాడ్ ఫాదర్ మూవీ ని తెలుగు తో పాటు హిందీcలో కూడా విడుదల చేశారు. సల్మాన్ ఖాన్మూవీ లో ముఖ్య పాత్రలో నటించడం వల్ల బాలీవుడ్ నుండి కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా టైగర్ 3 మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. టైగర్ 3 మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. 2023 వ సంవత్సరం దీపావళి కానుకగా టైగర్ 3 మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా , యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది. ఈ మూవీ లో షారుక్ ఖాన్ ,  ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: