బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాల తో వరల్డ్ వైడ్‌గా పాపు లారిటీ సంపా దించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరో లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్ల ను రాబట్టింది. తాజా గా జక్కన్న గురించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ మాన్ ఆసక్తికర విష యాలను అభిమాను లతో పంచు కున్నాడు. మగధీర'  చూసినప్పుడే రాజమౌళి గురించి అర్థమైందని ఏర్. రెహమన్ తెలిపాడు. ''మగధీర సినిమా చూసినప్పుడే రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. తర్వాత వచ్చిన 'బాహుబలి' చూసి ఆశ్చ ర్యపోయాను. రాజమౌళి సినిమాలు టాలీవుడ్ కీర్తి, ప్రతిష్ఠల ను పెంచుతున్నాయి'' అని ఏఆర్. రెహ మాన్ తెలిపాడు. పాన్ ఇండియా సినిమాల గురించి కూడా ఈ మ్యూజిక్ కంపోజర్ మాట్లాడాడు. 'రోజా' , 'బాంబే'  'దిల్ సే'  సినిమా లన్ని పాన్ ఇండియా నే అని పేర్కొన్నాడు. రెహమాన్ తాజాగా 'పొన్నియిన్ సెల్వన్‌'  కు సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ చిత్రం వరల్డ్‌వైడ్బాక్సాఫీస్ వద్ద రూ.475కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చోళుల కథతో 'పొన్నియిన్ సెల్వన్' రూపొందింది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభా స్కరన్ నిర్మించాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తమిళనాడులో మాత్రం భారీ విజయం సాధించింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లోను రూ. 6మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. 'పొన్నియిన్ సెల్వన్-2' వచ్చే ఏడాది వేసవి కాను కగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: