మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మంచి విష్ణు ఎన్నో మూవీ లలో నటించి హీరోగా తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు "జిన్నా" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా , కోనా వెంకట్మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ లో సన్నీ లియోన్ , పాయల్ రాజ్ పుత్ , మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు. జిన్నా మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఎంత గానో ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులకు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్న నేపథ్యం లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో థియేటర్ లు కూడా లభించాయి  మరి జిన్నా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

జిన్నా మూవీ నైజాం ఏరియాలో 90 థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ సీడెడ్ ఏరియాలో 45 థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఆంధ్రా లో జిన్నా మూవీ 140 థియేటర్ లలో విడుదల కాబోతోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జిన్నా మూవీ 275 థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇలా మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పరవాలేదు అనే సంఖ్యలో  థియేటర్ లలో విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: