మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  అంజలి ,  సునీల్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ సాంగ్ చిత్రీకరణ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బ్యూటిఫుల్ గర్ల్ కియారా అద్వానీ వచ్చే నెలలో న్యూజిలాండ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను శంకర్ తన స్టైల్ లో అద్భుతమైన ,  సుందరమైన లొకేషన్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే శంకర్ ఈ సినిమాను తన పూర్వ మూవీ ల మాదిరి గానే అద్భుతమైన గ్రాండ్ గా తెరకేక్కిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇది వరకే రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: