తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ మరియు మంచి అందం ఉన్న ముద్దుగుమ్మలలో ఒకరు అయిన వర్షా బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తేరకెక్కిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. అయినప్పటికీ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 

మూవీ ద్వారా వర్షా బొల్లమ్మ కు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా వర్షా బొల్లమ్మ "స్వాతి ముత్యం" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన స్వాతి ముత్యం సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో వర్ష బోల్లమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. 

ఇలా వరుస మూవీ లతో కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా వర్షా బొల్లమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి  అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం వర్ష బొల్లమ్మ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: