సినిమా కథలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అక్కినేని ఎన్టీఆర్ ల పాత సినిమాలలో తల్లి సెంటిమెంట్ చెల్లి సెంటిమెంట్ ఎక్కువగా కనపడుతూ ఉండేవి. ఇప్పుడు కూడ ఆ సెంటిమెంట్ తన రూపం మార్చుకుని నేటితరం ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవ్వాలి అంటే దేవుడు సెంటిమెంట్ కథలో అంతర్లీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఈనాటి తరం ప్రేక్షకుడు ధియేటర్లకు వస్తున్నారా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కలుగుతున్నాయి.


‘రంగస్థలం’ హిట్ అయ్యాకా హీరోలు అంతా మాసిపోయిన లుంగీలు కట్టుకుని గుబురు గడ్డాలు మీసాలు పెంచుకుని సినిమాలు చేస్తుంటే మీడియం రేంజ్ హీరోలు మాత్రం దేవుడు సెంటిమెంట్ పై బాగా నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ‘అఖండ’ సూపర్ సక్సస్ తరువాత చాలామంది దర్శక నిర్మాతలకు తాము తీసే కథలో దేవుడు సెంటిమెంట్ పెడితే చాలు ఆమూవీ సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం బాగా పెరిగిపోయినట్లు కనిపిస్తోంది.


దీనికి ఉదాహరణగా ‘కార్తికేయ 2’ ‘కాంతార’ సినిమాల బ్లాక్ బష్టర్ విజయాలను పరిగణిస్తున్నారు. ఈసినిమా కథలు అన్నీ దేవుడు చుట్టూ తిరుగుతాయి. శివుడు కృష్ణుడు విష్ణుమూర్తి ల మహిమలను అంతర్లీనంగా చూపెడుతుతూ చెడు పై ఎప్పటికైనా మంచి విజయం సాదిస్తుంది అన్న పాయింట్ తో తీయబడ్డ ఈసినిమాలు అన్నీ బ్లాక్ బష్టర్ హిట్ అయ్యాయి.


ఇప్పుడు ఈ ట్రెండ్ ఏకంగా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న కొరటాల శివను కూడా ప్రభావితం చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల జూనియర్ తో తీయబోయే సినిమా కథ ఒక డివైన్ ఎలిమెంట్ తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బోయపాటి రామ్ తో తీయబోతున్న మూవీ కూడ శివ తత్వంతో లింక్ అవుతుంది అని అంటున్నారు. సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా కథ కూడ యాక్షన్‌ ఎలిమెంట్స్ ఉన్న డివైన్ సెంటిమెంట్ మూవీ అంటున్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రెండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: