హీరో అడవి శేషు తను నటించే సినిమాలు అన్ని విభిన్నమైన కథలతో కూడి ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలు విడుదలై మంచి విజయాలను కూడా అందుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హిట్ -2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నారు.ఇందులో కృష్ణదేవ అలియాస్ కేడి అనే హోమిసైడ్ ఇంటర్వెషన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. హిట్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్. ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషలలో మెప్పించడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సైలెస్ కొలను దర్శకత్వం వహించారు.


ఇక నేచురల్ స్టార్ నాని సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యం అవుతోంది ఇప్పటికే మేకర్ ఈ సినిమా గురించి కొత్త విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. హీట్ -2 సినిమా డిసెంబర్ రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక హిట్ సినిమాలో మొదట విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా సీక్వెల్లో అడవి శేషు నటించబోతున్నారు. అయితే ఈ సినిమా మొదటి భాగానికి రెండో భాగానికి లింక్ చేసి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరంతా కలిసి ఒక పెద్ద కేసును సాల్ చేసేటప్పుడు విశ్వక్ స్టోరీ కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్లుగా తెలుస్తోంది. అయితే హిట్ -2 సినిమా చూడాలి అంటే మొదటి భాగాన్ని చూడాల్సిన అవసరం లేదు కానీ ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఈ సినిమా టీజర్ నవంబర్-3 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: