తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హెచ్ వినోద్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హెచ్ వినోద్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి , తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఈ సంవత్సరం అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు.

హెచ్ వినోద్ "వలిమై" మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో కూడా రూపొందించాడు. భారీ అంచనాల నడుమ తమిళ్ ,  తెలుగు ,  కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో విడుదల అయిన వలిమై మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హెచ్ వినోద్ , అజిత్ హీరోగా తేరకెక్కుతున్న తునివూ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే హెచ్ వినోద్ "తునివూ" మూవీ విడుదల కాకముందే తన తదుపరి ప్రాజెక్ట్ ను కూడా ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం హెచ్ వినోద్ తన తదుపరి మూవీ ని లోక నాయకుడు కమల్ హాసన్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. తునివూ మూవీ విడుదల అయిన తర్వాత కమల్ హాసన్  ,  హెచ్ వినోద్ కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: