టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత స్టార్డం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ఎంతమంది ప్రేక్షకులను సంపాదించారు. గతంలో కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి కెరియర్ లో ఫ్లాప్ లు రావడంతో కెరీర్ ముగిసినట్లే అని వార్తలు కూడా వినిపించాయి. అయితే డైరెక్టర్ సుబ్బయ్య తెరకెక్కించిన చిత్రం హిట్లర్ తో ఒకసారిగా తన కెరీయర్ని మలుపు తిప్పుకున్నారు చిరంజీవి. 1997లో విడుదలైన ఈ కుటుంబ కథ చిత్రం ప్రేక్షకులను బాగా ఆలరించింది ముఖ్యంగా విచిత్రంలో అన్నాచెల్లెళ్ల మధ్య జరిగే స్టొరీ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసింది.


ఇక తనలో ఇంత సత్తా ఉందని చిరంజీవికే తెలియలేదట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక అక్కడి నుంచి చిరంజీవి కెరియర్ మళ్ళీ వరుసహిట్ లతో సాఫీగా సాగిపోయిందని చెప్పవచ్చు. ఇక 2007లో చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు దాదాపుగా పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ -150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాలలో నటించారు ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది అయితే ఆ తర్వాత చిరంజీవి తన మార్కు విజయాలను అందుకోలేకపోయారని చెప్పవచ్చు.


అటు తర్వాత సైరా నరసింహారెడ్డి ,ఆచార్య తదితర చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టుకోలేక పోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆశలన్నీ వాల్తేరు వీరయ్య సినిమా మీది పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్నది.ఈ చిత్రానికి పోటీగా బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతోపాటు విజయ్ దళపతి నటిస్తున్న వారసుడు చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు.ఇక కంటెంట్ పరంగా బాగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని ఇప్పటికి ఎన్నో చిత్రాలు ప్రూఫ్ చేశాయి మరి చిరంజీవి తన సత్తా ని చాటుకుంటారు లేదా చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: