తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగి ఉన్న ఈ హీరో ఇప్పటికే తాను నటించిన అనేక అనేక మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేశాడు. అందులో భాగంగా కార్తీ నటించిన యుగానికి ఒక్కడు ,  ఆవారా , నా పేరు శివ , కాకి , ఖైది , పోన్నియన్ సల్మాన్ మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాలు అందుకున్న ఈ హీరో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ కలిగి ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ మరియు తెలుగు భాషలలో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇలా సర్దార్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న కార్తీ ప్రస్తుతం జపాన్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచరంగా ప్రారంభం కూడా అయింది. ఈ మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , అను ఇమ్మానుయల్ ఈ మూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 14 నవంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: