పవన్ కళ్యాణ్ హీరోగా చేసే సినిమాలకు దర్శకులుగా వ్యవహరించే వారి పరిస్థితి ఇప్పుడు ఎంతో అయోమయంగా ఉంది. ఒకవైపు ఆయన చేయవలసిన మొదలు పెట్టవలసిన సినిమాలు మధ్యలోనే ఆగిపోతుంటే ఇంకొక వైపు చేసిన దర్శకుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్ ఇప్పటిదాకా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఆయన అభిమానులు అయితే ఈ సినిమాలతో పండగ చేసుకున్నారని చెప్పాలి.

అయితే ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులకు ఇప్పటిదాకా ఒక్క సినిమా అవకాశం కూడా రాకపోవడం చర్చల్లో కూడా ఉండకపోవడం ఆయన అభిమానులు కొంత బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తే తప్పకుండా దర్శకులకు ఏమాత్రం కలిసి రాదనే విధంగా వారు చెబుతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు పవన్ కళ్యాన్.  ఆ దర్శకుల లాగానే ఉంటే మాత్రం తప్పకుండా పవన్ దర్శకులకు ఇబ్బందులు ఏర్పడడం ఖాయం అని చెప్పాలి. 

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను వేసవిలో విడుదల చేయబోతున్నారు అనే ప్రకటన ఇవ్వబోతున్నారట. ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జక్వలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ దర్శకులు అయన తో హిట్ కొట్టి వెంటనే మరో సినిమా చేయాలి కానీ ఇలా రోజులు వెస్ట్ చేస్తే మాత్రం వారికి ఇబ్బందులు తప్పవు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కోడా ఇప్పుడు చేస్తున్న సినిమా ను తప్పా మరే సినిమా చేయడం లేదనే చెప్పాలి. దీనిపై ఇప్పటికే సదరు చిత్ర నిర్మాతలకు, దర్శకులకు క్లారిటీ కూడా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: