
ఈ క్రమంలోనే రాబోతున్న సంక్రాంతి పండుగకు కోలీవుడ్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి విజయ్ దళపతి నటించిన "వారిసు" చిత్రం కాగా .. మరొకటి అజిత్ కుమార్ నటించిన "తునివు". కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా అవతరించిన అజిత్ సినిమా వస్తోందంటే అక్కడ కటౌట్లు మామూలుగా ఉండవు.. అంచనాలకు మించి ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. వలిమై దర్శకుడు వీహెచ్ వినోద్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను ఓవర్సీస్ బిజినెస్ హక్కులను బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకోగా..RRR, KGF-2 సినిమాలకు USA లో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన "Saregame" సినిమాస్ వారు అజిత్ యొక్క తునివుని డిస్ట్రిబ్యూటింగ్ హక్కులను కైవసం చేసుకుంది.
అంతేకాదు జనవరి 12వ తేదీన సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. కేవలం సౌత్ ఇండియన్ భాషల్లోని ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి. మొత్తానికి అయితే ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.