తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ప్రదీప్ రంగనాదన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రదీప్ రంగనాదన్ ఇప్పటికే అనేక తమిళ మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇప్పటికే తమిళంలో లవ్ టుడే మూవీ నవంబర్ 4 వ తేదీన విడుదల మంచి విజయం సాధించింది.  ఇప్పటికే ఈ మూవీ తమిళ భాషలో మంచి విజయం సాధించడంతో  లవ్ టుడే మూవీ ని అదే పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశాడు.

మూవీ నిన్న అనగా నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో తెలుగు భాషలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసుళ్ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 86 లక్షలు , సీడెడ్ : 26 లక్షలు ,  ఆంధ్ర : 1.10 కోట్లు.
మొత్తంగా 1 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే మూవీ 1.15 కోట్ల షేర్ , 2.22 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: