తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరోలలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా వరిసు కు దర్శకత్వం వహిస్తున్న మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా , నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని 2023 సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. 

మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి దిల్ రాజు ప్లాన్స్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాల థ్రియేటికల్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా థ్రియేటికల్ హక్కులను కూడా అవివేసింది. ఈ మూవీ నార్త్ అమెరికా హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ నార్త్ అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో విజయ్ ఏరేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: