ఈమధ్య సెలబ్రిటీలు పెళ్లిల విషయంలో ఏ మాత్రం మొహమాటం పడకుండా బయటికి చెప్పేస్తున్నారు. మామూలుగా కొందరైతే రహస్యంగా పెళ్లి చేసుకొని బాగా షాక్ ఇస్తారు.
కానీ ఈమధ్య అలా లేదు. ముందుగానే రిలేషన్ షిప్ లో ఉన్న విషయాన్ని బయట పెడుతూ పెళ్లి సమయాన్ని కూడా తెలుపుతున్నారు కొందరు నటులు. అయితే తాజాగా బుల్లితెర నటి రోహిణి కూడా తన పెళ్లి గురించి ప్రకటించింది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం రండి.

బుల్లితెర నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా రోహిణి తనకంటూ ఒక  ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన మాట తీరుతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. మొదట్లో సీరియల్స్ ద్వారా నటిగా అడుగు పెట్టింది రోహిణి. గతంలో తను నటించిన కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం తన మాట తీరుతో మంచి క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత పలు సీరియల్లలో కూడా నటించింది.

ఇక మాటీవీలో శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ తో తనలోని నటస్వరూపాన్ని కూడా బయటకు పెట్టింది. తర్వాత ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది. ఇక జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ లో ఎన్నో అవార్డులను సంపాదించుకుంది. సీరియల్స్ తోనే కాకుండా తన కెరీర్ లో ఇంకా  బాగా ఎదగాలని బిగ్ బాస్ వరకు వెళ్ళింది.

కానీ నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది. బిగ్ బాస్ తర్వాత కూడా రోహిణికి అనుకున్నంత అవకాశాలు రాలేదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా బుల్లితెరపై సీరియల్స్ లలో మళ్ళీ కనిపించలేదు. ఇక వెండితెరపై అవకాశాలు రావడంతోకొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించింది. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అవకాశం అందుకుంది. అందులో తన కామెడీతో బాగా నవ్విస్తూ ఉంటుంది.

జబర్దస్త్ తో పాటు ఇతర కామెడీ షో లలో కూడా ఈమె ఎక్కువుగా కనిపిస్తూ ఉంటుంది రోహిణి. ఈమెకు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫాలోవర్స్ కి టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో రోహిణి బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియా ఖాతాలో తన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పెడుతూ బాగా సందడి చేస్తుంది.

ఇక యూట్యూబ్లో తన పేరు మీద ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా స్నేహితులతో అయినా లేకపోతే ఏ పండగ జరిగినా సరేవాటిని సరదాగా వీడియో తీసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కువుగా పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తను వంటలు కూడా చేస్తున్న వీడియోలను పంచుకుంటూ అందరికీ వాటి గురించి వివరిస్తూ ఉంటుంది.ఈ బ్యూటీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. పైగా ఈమెకు ఎటువంటి లవ్ కనెక్షన్లు కూడా అంతగా లేవు. కానీ తోటి నటులతో బాగానే మూవ్ అవుతుంది. అయితే తాజాగా తనే తన పెళ్లి గురించి ప్రకటించింది. ఇంతకు అసలేం జరిగిందంటే.. మామూలుగా తను ఏవైనా ఫోటోలు దిగితే వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

అలా తాజాగా నల్ల చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని ఫోటోలు వాటిని తన ఇన్ స్టా వేదికగా  ఈ నటి ఇలా పంచుకుంది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి మరీ,అందులో రోహిణి చాలా అందంగా కనిపించింది. అయితే ఆ ఫోటోని చూసిన అషు రెడ్డి ఏంటి స్పెషల్ అని పెట్టడంతో.. నా పెళ్లి అంటూ సరదాగా కామెంట్ చేసింది. అయితే ఇందులో ఆమె చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ.. కొంతమంది నెటిజెన్స్ మాత్రం పెళ్లి ముహూర్తాలు వస్తున్నాయి కదా బహుశా పెళ్లిచూపులు అయ్యాయేమో అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: