
ఈ విషయం తెలుసుకున్న దేశ ప్రజలు రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక కాంతారా విషయానికి వస్తే.. కన్నడలో అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ది లెజెండ్ అంటూ కర్ణాటకలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా అక్కడ జానపద కళ మన దగ్గర భూతకోలను ఎంత చక్కగా తెరపై ఆవిష్కరించాడు అంటే దర్శకుడికి మాత్రమే సాధ్యమైంది. ఈ సినిమా షూట్ రిషబ్ శెట్టి వాళ్ళ సొంత ఊర్లో జరపడం విశేషం.
ఇకపోతే కాంతారా సినిమా కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా సినిమాల రేంజ్ను కూడా దాటేసింది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి నాటికి కాంతారా సినిమాను నెట్ ఫ్లెక్స్ లో ఆంగ్లంలో గ్లోబల్ ఆడియన్స్ కోసం తీసుకురానున్నట్లు సమాచారం. ఇదే గను క త్వరగా జరిగితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.