ప్రముఖ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కిరిక్ పార్టీ సినిమా ద్వారా దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా మారి తెరకెక్కించిన చిత్రం కాంతారా.. సాంప్రదాయ పద్ధతులను మరిచిపోతున్న రోజుల్లో కనుమరుగైన ఒక సాంప్రదాయ పద్ధతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు తెలియజేశారు.  అంతేకాదు ఈ వృత్తిని నమ్ముకున్న కొంతమంది ప్రజలు ఎవరికీ కూడా తెలియకుండా పోవడంతో రిషబ్ శెట్టి ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రజలను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం చేత 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ కూడా ఇప్పించే ప్రయత్నం చేశారు రిషబ్ శెట్టి..

ఈ విషయం తెలుసుకున్న దేశ ప్రజలు రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక కాంతారా విషయానికి వస్తే.. కన్నడలో అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ది లెజెండ్ అంటూ కర్ణాటకలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా అక్కడ జానపద కళ మన దగ్గర భూతకోలను ఎంత చక్కగా తెరపై ఆవిష్కరించాడు అంటే దర్శకుడికి మాత్రమే సాధ్యమైంది. ఈ సినిమా షూట్ రిషబ్ శెట్టి వాళ్ళ సొంత ఊర్లో జరపడం విశేషం.

ఇకపోతే కాంతారా సినిమా కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా సినిమాల రేంజ్ను కూడా దాటేసింది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి నాటికి కాంతారా సినిమాను నెట్ ఫ్లెక్స్ లో ఆంగ్లంలో గ్లోబల్ ఆడియన్స్ కోసం తీసుకురానున్నట్లు సమాచారం. ఇదే గను క త్వరగా జరిగితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: