ఇక టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  కలయికలో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది.ఇక వచ్చే జనవరి నెల నుంచి SSMB 28 సెట్స్ మీదకు వెళుతుందని మూవీని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. నాన్ స్టాప్‌గా ఈ సినిమా షూటింగ్ చేస్తామని తెలియజేసింది. సినిమా షూటింగ్ కి అంతా సిద్ధమైందని, హుషారుగా సెట్స్‌లో అడుగు పెడతామని సంస్థ పేర్కొంది.ఇక త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు యూనిట్ సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ ఇంకా అలాగే నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ ఇంకా ఈ సినిమా సంగీత దర్శకుడు అయిన తమన్ దిగిన ఫోటోలు షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో బాగా సందడి చేశాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా నమ్రతా శిరోద్కర్ దంపతులతో పాటు SSMB 28 దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా సినిమా సంగీత దర్శకుడు తమన్ ఆ మధ్య ముంబైలో స్క్రిప్ట్ అలాగే మ్యూజిక్ విషయం గురించి డిస్కస్ చేశారు.


సినిమా కథ విషయంలో హీరో, దర్శకుడు మధ్య ఏకాభిప్రాయం అనేది కుదరపోవడం కారణంగా షూటింగ్ ఆగిందని వచ్చిన వార్తల్లో అసలు నిజం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.త్రివిక్రమ్,మహేష్ మొదటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్.పైగా త్రివిక్రమ్ కి మొదట ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.అందువల్ల వాళ్ళ మధ్య అలాంటి బేధాలు రావు.అందుకే ఆ వార్తలు అసలు నిజం కాదని చిత్ర వర్గాలు తెలిపాయి. మహేష్ తండ్రి కృష్ణ, తల్లి ఇందిరా దేవి గార్ల మరణాల కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది.ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.ఇక త్రివిక్రమ్సినిమా ఎలా అయిన మహేష్ కెరీర్ కే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని పక్కా ప్లాన్ తో వున్నాడట.మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: